18-12-2025 08:46:42 PM
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నరసారెడ్డి..
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ టోల్గేట్ సమీపంలో ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి హాజరయ్యారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అధిక శాతం కాంగ్రెస్ సర్పంచులు గెలవడం జరిగిందన్నారు.
ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్పంచ్ లు ఎక్కువ గెలిచారన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాను ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో తన స్వభావం ఏ మాత్రం చూపించలేదన్నారు, ఇకమీదట బీఆర్ఎస్ పార్టీ గల్లంతైపోతుందన్నారు.