8 July, 2026 | 1:52 AM

అరవై ఏళ్ళ జీవితంలో లోటుపాటులు చూశా..

08-07-2026 12:00 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, జూలై 7: నా తల్లిదండ్రులు జమాయమ్మ, జగ్గారెడ్డిలు అదృష్టంతో కూడిన పుట్టుకనిచ్చారని, ఈ అరవై ఏళ్ళ జీవితంలో ఎన్నో అవమానాలు, సన్మానాలు, అజ్ఞాతవాసాలు చూశానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం జగ్గారెడ్డి, ఆయన కూతురు జయారెడ్డి పుట్టిన రోజు వేడుకలను సంగారెడ్డిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు సాయం చేసే గుణం ఉన్నవాళ్ళని, అదే గుణం తనకు వచ్చిందన్నారు. 

రాజకీయంగా  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి ల నాయకత్వంలో మంత్రులందరి సహకారము తనకు ఉందన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందా లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజా ప్రభుత్వమని, పదేళ్ళలో సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ను కలిసే పరిస్థితి ఉందాని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నేరుగా కలెక్టర్తో సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉందన్నారు. సమస్యలు చెప్పుకుని పరిష్కరించుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ లోనే ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. అనంతరం జగ్గారెడ్డి చేత భారీ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.