30-09-2025 12:37:39 AM
అట్టావా, సెప్టెంబర్ 29: భారతదేశంతో పాటు విదేశా ల్లో హత్య లు, దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ కెనడా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆ దేశ భద్రతశాఖ మంత్రి గ్యారీ ఆనంద సంగరీ స్పందిస్తూ.. ‘ఇక నుం చి మా దేశంలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలకు తావివ్వం. ముఠా సభ్యులు ఎక్కడ ఆస్తులు ధ్వంసం చే సినా, వాహనాలను దహనం చేసినా వెంటనే అదుపులోకి తీసుకుంటాం.
ఈమేరకు ఇమిగ్రేషన్, భద్రత బలగాలు, పోలీసులకు ఆదేశాలిచ్చాం’ అని స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయంతో భారత్- కెనడా మధ్య సంబంధాలు మెరుగవుతున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని అక్కడి ప్రజాస్వామికవాదులు కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కెనడా ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.