calender_icon.png 30 September, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ సినిమాలపై 100శాతం సుంకం

30-09-2025 12:34:57 AM

  1. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో దూకుడు నిర్ణయం
  2. చిన్న పిల్లల చేతిలో చాక్లెట్  లాక్కున్నట్లు హాలీవుడ్‌ను ఆక్రవించారని వ్యాఖ్య
  3. భారతీయ చిత్రాలపై ప్రభావం

వాషింగ్టన్, సెప్టెంబర్ 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెలుపల చిత్రీకరించే చిత్రాలపై 100శాతం సుంకాలు విధిస్తున్నట్లు తాజాగా నిర్ణయం తీసుకు న్నారు. చిన్నపిల్లల చేతిలోని చాక్లెట్ లాక్కున్నట్లు, విదేశీ చిత్రాలు అమెరికా సినిమా (హాలీవుడ్) వ్యాపారా న్ని ఆక్రమించాయని ఆరోపించారు. తమ సినిమా చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలకు తాజా నిర్ణయం పరిష్కారం చూపుతుందని తాము భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.

అయితే.. తాజా నిర్ణయం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయం పై మాత్రం ట్రంప్ స్పష్టతనివ్వలేదు. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయ ప్రభావం భారతీయ చిత్రాలపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. ఇక్కడ నిర్మించిన సినిమాలకు అమెరికాకు మంచి డిమాండ్ ఉంది.

100శాతం సుంకం విధిస్తే సినీ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడతారనే అభిప్రాయం సినీవర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ముఖ్యం గా తెలుగు సినిమాలపై మరింత ఎక్కువ ప్రభావం అవకాశం కనిపిస్తున్నది. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షేర్లు 1.5శాతం పడిపోవడం గమనార్హం.