calender_icon.png 30 September, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజాగ్రహం

30-09-2025 12:42:48 AM

  1. ప్రాథమిక హక్కుల కోసం గళమెత్తిన నిరసనకారులు
  2. పాకిస్థాన్ చెర నుంచి స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు
  3. ఉద్రిక్తతలో ఇద్దరు మృతి.. 22మందికి గాయాలు

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 28: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో  ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. పాక్ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఉద్రిక్తతలో ఇద్దరు మృతి చెందగా మరో 22మంది గాయాలపాలయ్యారు. అవామీ యాక్షన్ కమిటీ మొత్తం 38 డిమాండ్లతో సోమవా రం నుంచి ‘షట్టర్ డౌన్, వీల్ జామ్’ నిరవధిక బంద్ చేపట్టాలని పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతా వరణం నెలకొంది.

పాకిస్థాన్ చెర నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటూ వీధుల్లోకి వచ్చి ప్రజలు నినాదాలు చేశారు. దశాబ్దాలుగా తమకు జరుగుతున్నదని పేర్కొన్నారు. కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయాలనపి డిమాండ్ చేశారు. ఆ సీట్ల కేటాయింపుతో స్థానిక ప్రజల ప్రాతినిధ్యం ఉండటం లేదని తెలిపారు. అలాగే గోధుమ పిండిపై రాయితీ ఇవ్వాలని, విద్యు త్ చార్జీలను తగ్గించాలని కోరారు.

తమ పో రాటం ఏ సంస్థకూ వ్యతిరేకం కాదని, 70 ఏళ్లుగా తాము ప్రాథమిక హక్కులకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం దిగి రాకుంటే, మున్ముం దు ఆందోళనలను ఉధృతం చేస్తామని హె చ్చరించారు.  ఆందోళనలను పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నదని ఆరో పించారు. ఆందోళనలకు ముందు అవామీ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభు త్వం, పీవోకే పరిపాలన అధికారులతో కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.

చర్చలు విఫలం కావడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. నిరసనకారులు ఒకచోట గుమికూ డకుండా పాక్ ప్రభుత్వ ఆదివారం అర్ధ రాత్రి నుంచి పీవోకేలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కీలక నగరాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది. ప్రధాన పట్టణాల్లో సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వ హించింది.