2 April, 2026 | 4:20 AM

కాంగ్రెస్‌లో చేరికలు

06-05-2024 01:40 AM

మహబూబ్‌నగర్, మే 5 (విజయక్రాంతి): పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమం తమ బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకంలో రోజువారి కూలీ రూ.400 చేస్తుందని తెలిపారు. నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శరత్, బ్యాగరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.