calender_icon.png 1 October, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ బీఆర్ఎస్ లది లోపాయికారి ఒప్పందం

01-10-2025 06:53:02 PM

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ బీఆర్ఎస్ లు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని, రెండు పార్టీలు రిజర్వేషన్ల పట్ల ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, కామారెడ్డి డిక్లేరేషన్ లో చెప్పినట్టు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ లోని 5 ఎంపీపీ, 5 జడ్పీటీసీ స్థానాలు, గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను గెలుచుకుంటామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు.  20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, 20 నెలల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, సన్నబియ్యం, రైతులకు రుణమాఫీ, 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమచేశామని ఇది ప్రజా ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ,బిఆర్ఎస్ బీసీ డిక్లరేషన్ పట్ల ద్వంద్వ వైఖరి బయటపడుతుందని బయటికి మద్దతు ప్రకటిస్తూనే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నా కూడా, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు గురించి మాట్లాడి ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా రిజర్వేషన్ పెంచలేదని అన్నారు.ఇప్పుడు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందని ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.స్థానిక పోరులో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని స్పష్టం చేశారు. పార్టీ ఇంచార్జిగా తాను హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పానని,దానికి అనుకూలంగా ఎస్డిఎఫ్ నిధులతో ప్రిసైడింగ్ కాపీలు ఇచ్చామని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు చెరో 15 కోట్లు మంజూరు చేపించామని, ఆ నిధుల ద్వారా పట్టణాల్లోని సీసీ రోడ్, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి శ్రీకారం చూపెడుతామని అన్నారు. ఉప ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి చేసింది, తీసుకొచ్చింది శూన్యమని, ఏం నిధులు తీసుకొచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇయ్యందనుకు, రేషన్ కార్డు ఇయ్యనందుకు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.