calender_icon.png 1 October, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

01-10-2025 08:00:33 PM

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: గత మూడు రోజులుగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో మండల, గ్రామ యూత్ కాంగ్రెస్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి నూతనకల్, 2వ బహుమతి కోదాడ, 3వ బహుమతి హుజూర్నగర్, 4వ బహుమతి జాజిరెడ్డిగూడెం, 5వ బహుమతిని మోతె జట్టు కైవసం చేసుకున్నాయి. గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రధాత, డీసీసీ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యుల ఆదేశానుసారం ఆయా జట్లకు నగదుతో పాటు షీల్డ్ లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి, వల్లాల ఖాజా, బింగి కృష్ణమూర్తి, మామిడి అనిల్, రాజ్ కుమార్, జెర్రిపోతుల రాంబాబు, విజయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.