01-10-2025 07:35:55 PM
భారీగా హాజరైన చిన్నారి బాలికలు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిన్నారి బాలికలకు కన్నె పూజను విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు గురాచారి జోషి చేసిన మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు పాదపూజ నిర్వహించి కానుకలు అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు గురాచారి జోషి మాట్లాడుతూ చిన్నారులు కల్మషం లేని దైవంశ సంభూతులని వారిలో దుర్గామాతను కొలిచే విధంగా చూడాలని అన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.