calender_icon.png 1 October, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.. ఆదమరిచినా ప్రమాదం

01-10-2025 07:42:51 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని విధి నిర్వాహణలో వివిధ వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి వాహనాలను నడపాలని ఘట్ కేసర్ జనచైతన్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సారా శ్రీనివాస్ గౌడ్(చిన్న) సూచించారు. ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు వాహనాలను నడుపుతున్న సమయంలో మద్యం సేవించరాదని, సెల్ ఫోన్ సంభాషనలు జరుపకూడదని, బస్సుల్లో అయితే గమ్యానికి చేరాల్సిన 50 కుటుంబాలు ఉంటాయన్న విషయాన్ని డ్రైవర్ గుర్తుంచుకోవాలన్నారు. ఒక చేత్తో పొగతాగుతూ మరో చేత్తో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని అలా చేయకూడదన్నారు. ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం జరిగి మనతో పాటు ఎదుటివారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని కోరారు. వాహనాలను నడిపే సమయంలో డ్రైవర్లు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.