జీవన్‌రెడ్డికి బుజ్జగింపులు
19-03-2026 01:31 AM
- జగిత్యాలకు ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి
- జీవన్‌రెడ్డి నివాసంలో 30 నిమిషాల పాటు సమావేశం
జగిత్యాల, మార్చి 18 (విజయక్రాం తి) : మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నది. జగిత్యాలలో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి బుధవారం జీవన్‌రెడ్డితో సమావేశమయ్యారు. జీవన్‌రెడ్డి నివాసంలో సుమారు 30 నిమిషాల పా టు వివిధ అంశాలపై చర్చించారు. కాం గ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చానని, 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడ్ని పార్టీ వదులుకోదని కత్తి వెంకటస్వామి అన్నారు. జీవన్‌రెడ్డి ఆవేదనతో ఉన్నారని, చర్చల విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.




