03-12-2025 09:47:59 AM
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన హాకర్ 800A ఎయిర్ క్రాఫ్ట్ వేలం(Aircraft auction) వేస్తున్నట్లు ప్రకటించింది. ఫాల్కన్ కేసులో సీజ్ చేసిన విమానాన్ని వేలం వేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు వెల్లడించారు. ఫాల్కన్ సంస్థ రూ. 792 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. బాధితులకు డబ్బుతో 2024లో ప్రధాన నిందితుడు అమర్ దీప్(Amar Deep) ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు చేశాడు. కేసు నమోదు తర్వాత అదే ఎయిర్ క్రాఫ్ట్ లో విదేశాలకు వెళ్లాడు. అమర్‌దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులకు సంబంధించిన కేసుకు సంబంధించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) కింద నిర్వహించిన సోదాల సందర్భంగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 7, 2025న ఈ విమానం స్వాధీనం చేసుకున్నారు. విమానాన్ని సీజ్ చేసిన ఈడీ అధికారులు నిర్వహణ భారంతో బేగంపేటకు తరలించారు. రిజిస్ట్రేషన్ నంబర్ N935H కలిగిన ఈ విమానం డిసెంబర్ 7 వరకు పరిశీలించుకోవచ్చ, డిసెంబర్ 9న ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా వేలం వేయనున్నట్లు ఈడీ ప్రకటన చేసింది. వేలంలో వచ్చిన డబ్బును బాధితులకు పంచాలని ఈడీ యోచిస్తోంది.