24 July, 2026 | 4:32 AM

బీజేపీ క్లీన్ స్వీప్

05-06-2024 03:01 AM

హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ మొత్తం ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒక్క సీటు ఎస్సీ రిజర్వుడ్. ఉన్న ఐదు సీట్లకు ఐదు సీట్లను బీజేపీ గెలుచుకుంది.     వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుండటం గమనార్హం. హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ గెలుపొందారు. పౌరీ ఘర్వాల్ స్థానం నుంచి అనిల్ బలూనీ నైనిటాల్ నుంచి బీజేపీ అభ్యర్థి అజయ్ భట్, అల్మోరా నుంచి అజయ్ తమ్త గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన కాంగ్రెస్ ఈసారి కూడా చతికిలపడింది. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీచినప్పటికీ ఈ మంచుకొండల రాష్ట్రంలో ఆ ప్రభావం కనిపించలేదు. ఇక్కడ మోదీ హవా స్పష్టంగా కనిపించింది.