24 July, 2026 | 5:39 AM

జార్ఖండ్‌లోనూ బీజేపీదే పైచేయి

05-06-2024 03:00 AM

జార్ఖండ్‌లో మొత్తం 14 స్థానాలకు గాను బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. జేఎంఎం 3 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, ఏజేఎస్‌యూ 1 స్థానం దక్కించుకున్నాయి. దాదాపు 2.54 కోట్ల మంది ఓటర్లు గల జార్ఖండ్‌లో నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 13, మే 20, మే 25, జూన్ 1లో ఎన్నికలు నిర్వహించారు.  ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను అవినీతి కేసులో అరెస్టు చేసినప్పటికీ.. అధికార పార్టీని ఆయన సతీమణి ముందుండి నడిపించారు. భర్తపై వచ్చిన ఆరోపణలను సమర్ధంగా తిప్పికొట్టి పార్టీని విజయం వైపు నడిపించారు. ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి బీజేపీ ఆరోపణలను, ఈడీ, సీబీఐ దాడులను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఈ గెలుపుతో జేఎంఎం మళ్లీ పుంజుకొన్నట్టయ్యింది.