బెంగాల్‌లో దీదీ హవా
05-06-2024 03:03 AM
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హవా కొనసాగింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలు గల పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) 29 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 12 స్థానాలకే పరిమితమైంది. ఇక, కాంగ్రెస్ ఒక్క స్థానం దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో 18 సీట్లు దక్కించుకున్న బీజేపీ.. ఈ సారి అత్యధిక సీట్లలో నెగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దీదీ హవా ముందు పనిచేయలేదు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 7.58 కోట్ల మంది ఓటర్లు ఉండగా 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. టీఎంసీపై ఈసారి పైచేయి సాధించేందుకు మోదీ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.






