calender_icon.png 24 October, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్టలో రైతులకు న్యాయం చేయాలని బీజేపీ ధర్నా

23-10-2025 08:37:34 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులను హామీల పేరుతో వంచించి పాలన గాలికి వదిలేసి, ఎమ్మెల్యేలు ,ఎంపీలు కొట్టుకుంటూ రోజుకో విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, పాడి రైతులకు సుమారు ఆరు నెలల నుండి బిల్లులు ఇవ్వకుండా పాల రేటు తగ్గించి రైతుల రక్తాన్ని తాగుతున్నారని, ఒకవైపు దానా రేట్లు పెరుగుతూ ఇటు పాల దిగుబడి రాక పాడి రైతులు హరిగోశ పడుతున్నారనీ, అధికారంలోకి వచ్చే ముందు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి అమలు చేయక పోగా స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామంలో రెండు లక్షల రుణం మాఫీ అందరికి అయిందా ఒకవేళ అందరికీ అయితే ఇదే తాసిల్దార్ కార్యాలయం ముందు నేను క్షమాపణ కోరతానీ తెలిపారు.

 రైతులకు ఇస్తానని బోనస్  ఎటు పాయే, కౌలు రైతులకు ఇస్తా అన్న 15000 రూపాయలు ఎటు పాయే రైతులకు ఇస్తాను అన్న భరోసా ఏది ఏ విధంగా చూసినా కూడా రైతులను వంచించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనీ, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, ప్రతి గ్రామంలో సిసి  కాంక్రీట్ కల్లంను ఏర్పాటు చేయాలని , ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు విషయంలో ఆలస్యం కాకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

ఇట్టి కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ ,రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గుంటుపల్లి సత్యం ,పట్టణ అధ్యక్షులు కర్ర ప్రవీణ్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్ ,జిల్లా భానుచందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గంధమల్ల మహేష్ ,మండల ఉపాధ్యక్షులు ఏలూరు సత్యనారాయణ ,సీనియర్ నాయకులు భువనగిరి శ్యాంసుందర్ ,లంకలపల్లి శ్రీనివాస్ ,బొమ్మగాని రాజమణి ,జిల్లా కార్యవర్గ సభ్యులు దొంత భరత్ ,సారాజీ లక్ష్మయ్య ,మిట్ట వీరేష్ ,ఆవుల సత్యనారాయణ  ,దొమ్మాట ప్రభాకర్ ,సుడుగు రాజిరెడ్డి ,వాల్మీకి అజయ్ ,జి వినోద్ ,దొమ్మాట నరేష్ ,కర్ర లక్ష్మయ్య, కళ్లెం శ్రీనివాస్ , బండి మహేష్ ,స్వామి,గుండ నరసింహులు,  సాయి ,నవీన్ ,గణేష్ చారి ,ఆకుల దేవేందర్ ,కాలూరి విజయ్ ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.