calender_icon.png 24 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్ తరాలకు పునాదులు

23-10-2025 08:35:16 PM

మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ పై విద్యార్థులకు అవగాహన..

మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం మరిపెడ పోలీస్ స్టేషన్ లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు  ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును, పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు, పౌరులు పొందాల్సిన సేవల గురించి వివరించారు. విద్యార్థులకు డయల్ 100, షీ టీమ్, సైబర్ క్రైమ్, ఆయుధాల పనితీరు, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టలు, డ్రగ్స్ వాడినప్పుడు మూత్రం ద్వారా టెస్ట్ చేసి నిర్ధారించవచ్చని అన్నారు.

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఫింగర్ ప్రింట్ ద్వారా పాత నేరస్తులను గుర్తుపట్టడానికి సులభంగా ఉంటుందని వివిధ అంశాలపై పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ అమరవీరుల గురించి,భరోసా సెంటర్,ప్రెండ్లి పోలీసింగ్ విధానం మైనర్ విద్యార్థులు బైకులు గాని వాహనాలు గాని నడప రాదని వారికి సూచించారు.విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు జీవితంలో సాధించాల్సిన అంశాల గురించి, చదువు ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజకుమార్ గౌడ్, మరిపెడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ -2 కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.