23-10-2025 08:39:22 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయి, అన్ని కుప్పలను ఈరోజు మాయిచ్చర్ చెక్ చేస్తున్నారా, తేమ శాతం వచ్చిన వాటిని వెంటనే తూకం వేసి లారీ లోడ్ చేసి మిల్లులకు తరలించాలి అని ఆలస్యం చేయొద్దు అని అన్నారు. మల్లాపురం ఐకెపి కొనుగోలు కేంద్రంలో కరెంటు సదుపాయం లేదు కల్పించాలి అని రైతులు కోరడంతో వెంటనే సంబంధిత కరెంటు ఎస్ ఈ కి ఫోన్ చేసి సాయంత్రం లోపు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతులు ఎవ్వరు కూడా బయట దళారులకు ధాన్యం విక్రయించవద్దని. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు.