1 June, 2026 | 2:29 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

12-04-2026 01:10 PM

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం పర్యటించారు. ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1-12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను తీసుకొస్తుండడంతో చిగురు మామిడి మండలంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలంపై అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు.

అనంతరం చిగురు మామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 ఎస్ఎంఏఎం రాయితీపై 24 మంది రైతులకు 40.80 లక్షల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లను, యంత్రాలను, 15 రోటావేటర్లు, బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు, తదితర పనిముట్లు పంపిణీ రైతులకు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్  అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేష్, ఎమ్మార్వో, ఇతర ముఖ్య నేతలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు , అధికారులు పాల్గొన్నారు.