24 July, 2026 | 2:21 AM

బోణీ కొట్టని కమలం

05-06-2024 03:04 AM

తమిళనాడులో ఇండియా కూటమి పైచేయి సాధించింది. మొత్తం 39 స్థానాలకు గాను డీఎంకే 22, కాంగ్రెస్ 9, సీపీఎం 2, సీపీఐ 2, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. మొత్తం ఇండియా కూటమికి చెందిన పార్టీలే విజయం సాధించాయి. బీజేపీ బోణీ కొట్టలేకపోయింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. అన్నామలైతో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా ఓడిపోయారు. అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఏప్రిల్ 19న అన్ని స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం ఓటర్లు 6.19 కోట్ల మంది. 2019 ఎన్నికల్లోనూ డీఎంకే నేతృత్వంలోని యూపీఏ 39 సీట్లకు గాను 38 సీట్లు గెలుచుకుంది.