బీజేపీదే పైచేయి
రాజస్థాన్‌లో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 25 సీట్లకు గాను 14 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలవగా సీపీఎం, ఆర్‌ఎల్‌పీ, బీఏపీ తలో సీటు గెలిచాయి. రాజస్థాన్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. 2014, 2019 రెండు పర్యాయాల్లో వరుసగా 24, 25 స్థానాల్లో గెలిచి బీజేపీ భారీ విజయం సాధించింది. కానీ, ఇప్పుడు 14 స్థానాలకు పడిపోవడం గమనార్హం. మరోవైపు గత రెండు ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవని కాంగ్రెస్ ప్రస్తుత ఎలక్షన్‌లో పుంజుకుని 8 సీట్లు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తేదీల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.30 కోట్ల మంది ఉన్నారు. 25 స్థానాల్లో 3 సీట్లు ఎస్టీలు, 4 సీట్లు ఎస్సీలకు కేటాయించారు.






