24 July, 2026 | 6:39 AM

ఈశాన్యంలో బీజేపీ పట్టు

05-06-2024 02:59 AM

అసోంలోని మొత్తం 14 సీట్లలో బీజేపీ 9 స్థానాలు, ఆ పార్టీ మిత్రపక్షాల అభ్యర్థులు మరో రెండు చోట్ల గెలిచారు. కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచింది. మణిపూర్‌లోని రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. త్రిపురలో రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది. నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. సిక్కింలోని ఏకైక స్థానాన్ని ఆ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎస్‌కేఎం పార్టీ విజయం సాధించింది. మిజోరంలోని ఒకే స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకున్నారు.