10 May, 2026 | 8:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

భద్రాద్రి రామాలయం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

08-12-2025 12:00 AM

బిజెపి స్పోక్ పర్సన్ మాధవి లత

భద్రాచలం, డిసెంబర్ 7, (విజయక్రాంతి): భద్రాద్రి రామాలయం అభివృద్ధికి బిజెపి పార్టీ కట్టుబడి ఉందని, భద్రాచలం సర్పంచ్ అభ్యర్థి హరిచంద్ర నాయక్ ను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి భద్రాద్రి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బిజెపి స్పోక్స్ పర్సన్ మాధవి ల త అన్నారు. భద్రాచలం లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిమిత్తం భద్రాచలం వచ్చిన మాధవి లత ఆదివారం ఉద యం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూబి ఆర్ ఎ స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు భద్రాద్రి దివ్యక్షేత్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని, దీంతో రా మయ్యకు ఇంకా వనవాసం తప్పలేదు అనిపిస్తుందని అన్నారు. . ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పాకిస్తాన్, ము స్లిం జపం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఒక్క సారి మాత్రమే సీతారాముల కళ్యాణానికి త లంబ్రాలు తెచ్చారని, రామాలయ అభివృద్ధికి ప్రకటించిన రూ. 100 కోట్లలో ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చే శారు.

2019-20గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.1028 కోట్లు మంజూ రు చేస్తే... కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.612 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని దుయ్యబట్టారు.ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి కేంద్రం లోని మోడీ నాయకత్వంలో గల బిజెపి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూ రు చేస్తే... 10 సంవత్సరాలుగా కనీసం స్థలం చూపలేదని ఎద్దేవా చేశారు.

భద్రాద్రి వాసులు కేవలం 8 కిలోమీటర్లు పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ కావాలని కోరితే... ప్రధాని మోదీ రూ.3592 కోట్లు ఖర్చుపెట్టి ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి నుండి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 173 కిలోమీటర్ల రైల్వే మార్గా న్ని నిర్మిస్తుందని అన్నారు. అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అని, భద్రాద్రిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు. కేసీఆర్ తన హామీ విస్మరిస్తే... బీజేపీ ప్రసాద్ స్కీం ద్వారా భద్రాద్రి అభివృద్ధి రూ.93 కోట్లు కేటాయించిందని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాస్, కురుచేటి రామచంద్ర మూర్తి, కుంజా ధర్మా, కుంచాల రాజా, తదితరులు పాల్గొన్నారు.