05-04-2025 12:00:00 AM
చిట్యాల ఇంచార్జి బానోత్ నాయక్
చిట్యాల, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): రాజ్యాంగ స్ఫూర్తిని బిజెపి విస్మరిస్తుందని చిట్యాల మండల ఇన్చార్జి బానోత్ నాయక్ అన్నారు.శుక్రవారం మండలంలోని దూత్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల అద్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బానోత్ కిషన్ నాయక్ హాజరై మాట్లాడుతూ భాజపా పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ,సమానత్వం హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తుందన్నారు.
భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రె స్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాద ముతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దమన్నారు.పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధుర వంశీ కృష్ణ ,జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,చిలుకల రాయకొమురు,గడ్డం కొమురయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లకొండ కుమార్, ఏకు రవీందర్ ,బుర్ర శ్రీనివాస్ గౌడ్,బొట్ల రవి, నంద రవి, శివ,నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.