04-04-2025 11:45:42 PM
చర్ల,(విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ లోని బీజాపూర్ జిల్లా సుక్మా లో గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాన్ని శుక్రవారం కేరలపాల్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో గుర్తించారు. నేడుమ్-భారియా గ్రామం యొక్క అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు ను భద్రత బలగాలు స్వాధీనం పరుచుకున్నారు. పోలీసు ఉన్నతాధికారు పంచనామా చేయుటకు ఆదేశించారు. మార్చౌరీలో పోస్ట్‌మార్టం ,క్లాక్ పంచనామా చర్య తర్వాత మావోయిస్టు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి సుక్మాలో ఉంచారు, మరణించిన మావోయిస్టు పేరు, నివాసం గుర్తింపు జరగలేదు. ఈ విషయాన్ని మీడియా ఇతర మార్గాల ద్వారా ప్రసారం చేయబడింది. చనిపోయిన మావోయిస్టు ను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసు భద్రత బలగాలు అప్పగించనున్నారు.