9 July, 2026 | 6:12 AM

చెరువులు అనుసంధానిస్తే ప్రజలు స్వాగతిస్తారు

28-08-2024 12:34 PM

అమరావతి: తిరుపతిలో బీజేపీ నేత టీజీ వెంకటేశ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. చెరువుల ఆక్రమణల తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలను హర్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరువులు అనుసంధానిస్తే ప్రజలు స్వాగతిస్తారన్నారు. ఏపీలోనూ చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాటిని తొలగించాలని టీజీ వెంకటేశ్ సూచించారు.