మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు
28-08-2024 12:21 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు.






