13 May, 2026 | 8:16 AM

పెసర పంట కొనుగోలు చేయండి.. హరీష్ రావ్ డిమాండ్

28-08-2024 01:16 PM

హైదరాబాద్: పెసర పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లోనిర్లక్ష్యంగా  రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. పంట అమ్మాక వాటిని ఏర్పాటు చేస్తే దళారులకే లబ్ది చేకూరుతుందన్నారు. మద్దతు ధర ప్రకటించినా ఎవరూ ఆ ధర కు కొనుగోలు చేయడం సాధ్యం కాదన్నారు.కాంగ్రెస్ పాలనలో  వ్యాపారులు, దళారుల ఇష్టా రాజ్యం గా మారి ఆడింది ఆట పాడింది పాటగా మారిందన్నారు.