భిక్కనూరులో ‘ఇందిరమ్మ’ గృహప్రవేశాలు
భిక్కనూర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం భిక్కనూరులో విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మెతుకు మీనానాగరాజు దంపతుల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రమేశ్వరపల్లి లో లబ్ధిదారు అనిల్ తన నూతన గృహ ప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత ,సర్పంచ్ రాణీ రాజు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన వారికి పారదర్శకంగా ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. తమ కలను నెరవేర్చిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.




