08-12-2025 08:55:45 PM
హనుమకొండ (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా ఇంచార్జిగా నూతనంగా నియమితులైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కు సోమవారం ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు సహా రాష్ట్ర, జిల్లా పదాధికారులతో కలిసి పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వేద బ్యాంక్ వైట్ హాల్లో జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలలో బిజెపి బలపరుస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం సమీక్ష నిర్వహించారు. అనంతరం డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు మాట్లాడుతూ బూత్ స్థాయిలో ప్రతీ కార్యకర్త గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ చురుకుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, గుజ్జు సత్యనారాయణ రావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గట్టి కొప్పుల రాంబాబు, మాజీ జిల్లా అధ్యక్షులు దొంతి దేవేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్ తో పాటు రాష్ట్ర, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.