రైతుల లబ్ధే లక్ష్యంగా ఉండాలి
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రైతులకు లాభదాయకమైన, పారద్శక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నిర్ణయించారు. అందుకు ప్రభుత్వానికి ఒక సమగ్రమరైన నివేదికను అందజేయాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, మార్కెటింగ్ సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రైతు కమిషన్ కార్యాయలంలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు.
ఈ వర్క్‌షాప్‌కు వివిధ రైతు సంఘాల నాయకులతో పాటు జిల్లాల నుంచి వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు, మార్కెట్ విస్తరణ, డిజిటల్ సాధనాల ప్రోత్సాహంతో పాటు మధ్యవర్తుల ఆధారాన్ని తగ్గించాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, రైతుల ఆదాయం, స్థిరత్వం, జీవనోపాధిని మెరుపర్చడ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.






