calender_icon.png 30 September, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో రావణాసుర ప్రతిమ ఏర్పాట్లు

30-09-2025 03:23:05 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): అక్టోబర్ 2న నిర్వహించనున్న విజయదశమి పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు రావణాసుర ప్రతిమను సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అన్ని పార్టీల సహకారంతో తిలక్ క్రీడా మైదానంలో రావణాసుర వదను చేపట్టి దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రావణాసుర వద కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దళిత సంఘాలు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే వినోద్ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు, పలువురు వ్యాపారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.