30-09-2025 04:04:01 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆవుల కొమురయ్య, నిర్మల దంపతుల కుమార్తె ఆవుల స్రవంతి సోమవారం వాషింగ్టన్ డిసి వర్జినియాలో ఏర్పాటుచేసిన 20వ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మొదటి బహుమతి సాధించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం డిసి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చల్ల చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకొని విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మకు ఈ ప్రాంతంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఆదరణ ఉందని ఆమె తన బతుకమ్మ రీల్ తో మరోసారి నిరూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక గాయని కె. ఎస్ చైత్ర హాజరై స్రవంతి ని అభినందించారు.