30-09-2025 04:16:18 PM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో భారతదేశం మొత్తంలోనే ఎత్తయిన బతుకమ్మ కు రూపకల్పన చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించి ధ్రువీకరణ పత్రాన్ని ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి మంగళవారం అందుకున్నారు. చిట్యాల కు చెందిన ప్రముఖ సాహితీవేత్త డా. ఏనుగు నరసింహా రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేస్తూ ఇటీవల కాలంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు సంచాలకులుగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలంలోనే ప్రస్తుతం బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 29న హైదరాబాదులో తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భారతదేశం మొత్తంలోనే ఎత్తయిన బతుకమ్మకు రూపకల్పన చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించి ధ్రువీకరణ పత్రం పొందడం హర్షనీయమని, సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే తెలంగాణ బతుకమ్మకు గొప్ప స్థానం కల్పించినందుకు చిట్యాల ప్రాంతం గర్వపడుతుందని డైరెక్టర్ నరసింహారెడ్డికి కవులు, రచయితలైన సృజన సాహితీ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ళ ఆనంద్ , డా. సాగర్ల సత్తయ్య , ప్రమోద సాహితి అధ్యక్ష కార్యదర్శులు కందిమల్ల కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి , తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, గేయ రచయిత పగిడిపాటి నరసింహ, కవులు ఎల్లోజు బ్రహ్మచారి, కందిమల్ల రామ్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.