calender_icon.png 12 January, 2026 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో బీజేపీ ఆందోళన

12-01-2026 12:58:54 PM

తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్ 

మున్సిపల్ ముట్టడికి యత్నించిన బిజెపి నాయకులు 

అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత పరిస్థితి 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipality) పరిధిలో ఓటర్ లిస్టులలో తప్పుడు పేర్లు నమోదు చేశారని వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత పాలకవర్గం నేతలు తమకు అనుకూలమైన ఓటర్ల పేర్లు నమోదు చేశారని ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పుడు ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాల్సి ఉండగా ఇప్పటివరకు తొలగించలేదని బిజెపి నాయకులు ఆరోపించారు.

తప్పుడు ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు వినలేదు. ఓటర్ లిస్టులో తప్పుడు పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. 49 వార్డులలో ఓటర్ లిస్టులలో తప్పుడు ఓటర్లను  నమోదు చేశారని బిజెపి నాయకులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తప్పుడు ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వీపుల్, పట్టణ బిజెపి అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, వెంకట్, కుంట లక్ష్మారెడ్డి, రజనీకాంత్, రాజు పాటిల్, తదితరులు పాల్గొన్నారు.