calender_icon.png 12 January, 2026 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో వారికే బీఫాంలు

12-01-2026 12:51:19 PM

దేవుడి పేరు మీద ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారు?

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్(Integrated Schools) ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో 70 శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ అభివృద్ధి కోట్ల రూపంలో మారనుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో(Municipal elections) సర్వేల ఆధారంగా బీఫాంలు ఇస్తామన్నారు.

నిజామాబాద్ లో మంచి మెజారిటీతో గెలువబోతున్నామని జోస్యం చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ జరగుతోందని తెలిపారు. రెండో దఫాలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు  చేస్తామన్నారు. వేల ఉద్యోగాలను తొలగించిన ఘనత ప్రధాని మోదీకే(Prime Minister Modi) దక్కుతోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ ఎందుకు ఓటెయ్యాల్లో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరు మీద ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. దేవుడి పేరు మీద ఓట్లడిగే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.