calender_icon.png 12 January, 2026 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు ఆహ్వానం

12-01-2026 01:47:58 PM

హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 23 వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంతపంచమి  మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో, బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అర్చకులు కలిసి ఆహ్వానం అందించారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. గద్వాలలోని ఆలంపూర్‌లో ఉన్న శ్రీ జోగులాంబ ఆలయంలో జనవరి 19 నుండి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పంపబడింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి అధికారులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రాలను అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క,  కొండా సురేఖతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.