calender_icon.png 12 January, 2026 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి సంబరాలు.. ముఖ్యమంత్రికి ఆహ్వానం

12-01-2026 01:58:13 PM

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో(Khairatabad constituency) నిర్వహించనున్న సంబురాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నారు. అటు భాగ్య నగరంలో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  ఖైరతాబాద్  ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ముగ్గుల పోటీసులు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో భారీగా పాల్గొన్న యువతులు, మహిళలు పెద్ద ఎత్తున రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ముగ్గుల పోటీలు ఆకట్టుకుంటున్నాయి.