12-01-2026 02:21:48 PM
సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ.
తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు.
ఏపీ ఉల్లంఘనలను సుప్రీం దృష్టికి తీసుకొచ్చాం.
న్యూఢిల్లీ: పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై(Polavaram Nallamala Sagar project) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ(Senior advocate Abhishek Singhvi) వాదనలు వినిపించారు. తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుంది. పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా సీజేఐ ప్రకటించారు. రిట్ పిటిషన్ వల్ల పిటిషన్ కు ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పారు. సూట్ దాఖలు చేస్తే అన్ని పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇవాళ ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాజెక్టుపై మా అభ్యంతరాలతో రిట్ పిటిషన్ వేశామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. గత సోమవారం కూడా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరుఫున మా వాదనలు వినించామని ఆయన వెల్లడించారు. గత సోమవారం ఇచ్చిన వాదనలకు అదనంగా ఇవాళ మరికొన్ని వాదనలు వినిపించామని ఉత్తమ్ తెలిపారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది తెలంగాణ ముఖ్యమైన అంశం అన్నారు.
ఏపీ ప్రభుత్వం అనేక ఉల్లంఘనలు చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీ ఉల్లంఘనలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు. స్టాప్ వర్క్ ఆర్డర్ ను అమలు చేయట్లేదని కూడా కోర్టుకు చెప్పామన్నారు. ఏపీకీ కేటాయించిన 484.5 టీఎంసీలు.. ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ముందుకెళ్తోందని చెప్పినట్లు ఆయన సూచించారు. ముందుగా డిజైన్ చేసినదానికంటే అదనంగా ఏమీ చేయడానికి వీల్లేదని వాదించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఒరిజినల్ ఫామ్ కు అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదని వాదించామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.