26 April, 2026 | 1:26 AM

ప్రజల అభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కట్టాలి

10-05-2024 02:48 AM

బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు

మంచిర్యాల, మే 9 (విజయక్రాంతి): పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా బీజేపీ శ్రేణులు గురువారం మంచిర్యాలలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు, ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి రఘునాథ్ పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస థియేటర్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మురళీధర్ రావు మాట్లాడుతూ.. దేశం మరింత అభివృద్ధి పథంలో పయనించాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.