calender_icon.png 6 October, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

06-10-2025 07:21:28 PM

జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా..

వలిగొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు వివరాలను అందించాలని అన్నారు. అనంతరం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సేకరించి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల యాది రెడ్డి, రాచకొండ కృష్ణ, కనతాల అశోక్ రెడ్డి, లోడే లింగస్వామి పాల్గొన్నారు.