06-10-2025 07:57:41 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్..
తూప్రాన్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని తూప్రాన్ పట్టణంలోని నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపిటిసి, ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచ తప్పకుండా అమలు చేయాలని, ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మండల స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కొరకు మండల తహసిల్దార్లను నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తి అయి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ నియమావళికి లోబడి ఉండాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.