06-10-2025 07:53:59 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆందోళనను దేశవ్యాప్తంగా చేపడుతున్నందున ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ ఆందోళన కార్యక్రమం స్థానిక తాత్కాల్ చౌరస్తాలో ఇందిరా గాంధీ స్టాచు దగ్గర చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మెషిన్ రీడబుల్ ఓటరు జాబితాను ఫోటోలతో పాటు ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలని, తొలగింపు, చేర్పు జాబితాలను బహిరంగంగా విడుదల చేసేలా చూసుకోండి, తప్పుడు తొలగింపులకు అందుబాటులో ఉండే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రూపొందించాలని నాయకులు పేర్కొన్నారు. చివరి నిమిషంలో తొలగింపు ఓట్ల జోడింపును నివారించాలి, స్పష్టమైన కట్ ఆఫ్ తేదీని చాలా ముందుగానే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.