24 July, 2026 | 1:13 AM

రైతులకు అండగా బీజేపీ

31-05-2024 07:28 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (విజయక్రాంతి): రైతులకు అండగా నిలిచి, వారికి విత్తనాలు అందించేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన రైతులకు సరిపడా విత్తనాలు సమకూర్చాలని జిల్లారెవెన్యూ అధికారి రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు చెప్పారు. ఆయన వెంట పొనిశెట్టి వెంకటేశ్వర్లు, లట్టి మురళి ఉన్నారు.