రైతులపై లాఠీఛార్జి అమానుషం
31-05-2024 07:29 AM
మాజీ మంత్రి జోగు రామన్న
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): విత్తనాల కోసం వచ్చిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం అమానుషమని, అందుకు రాష్ట్రప్రభుత్వం సిగ్గుపడాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు సరపడా విత్తనాలు సరఫరా చేయడంలో సర్కార్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేతకాని తనంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.






