24 July, 2026 | 2:21 AM

అంజన్నకు పట్టు వస్త్రాల సమర్పణ

31-05-2024 07:26 AM

జగిత్యాల, మే 30 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయ సన్నిధిలో గురువారం ఆంజనేయుడి జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో తొలిరోజు  భద్రాచలం సీతారామచంద్రసామి దేవ స్థానం నుంచి ఆలయ అధికారులు, అర్చకులు కొండగట్టుకు వచ్చారు. కొండగట్టు ఆంజనేయసామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.