కుళ్లు రాజకీయాలు మానుకోవాలి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు హితవు పలికిన బి.జె.పి రాష్ట్ర అధికార ప్రతినిది
నగర డిప్యూటీ మేయర్ సునీల్ రావు
ముకరంపుర ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేరు తలవందె కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు పూట గడవని పరిస్థితి వచ్చిందని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మండి పడుతు కాంగ్రెస్ కుల్లు రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికారు. కరీంనగర్ లో గురువారం రోజు విలేకరుల సమావేశంలొ మాట్లాడుతూ... కరీంనగర్ నగర ప్రజలు బండి సంజయ్ కుమార్ ను విశ్వసించి భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో మా పాలకవర్గానికి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు.
మా పాలకవర్గం ఏర్పడి కనీసం రెండు మాసాలు కూడ గడవక ముందే ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ మా పాలకవర్గం పై విషం చిమ్మతున్నారని అన్నారు. మా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఇప్పుడిప్పుడే పాలనను గాడిలో పెడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీస్కున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో అధికారులను సమన్వయం చేస్తూ...ప్రజా సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు అధికారం చలాయించిన కరీంనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు.
కరీంనగర్ ను గొప్పగా అభివృద్ధి పరిచి రూపురేఖలు మార్చిన నాయకులు బండి సంజయ్ కుమార్ అన్నారు. చౌక బారు ఆరోపనలు, మానుకోవాలని హెచ్చరించారు. నగరంలోని డంపు యార్డు గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ళ బీఆర్‌ఎస్ పాలనలో తయారైందని అన్నారు. డంపు యార్డు సమస్యను పరిష్కరించాలన్న చిత్త శుద్ది తో మా నాయకులు పని చేస్తున్నారని... మా పాలకవర్గం ఆలోచన చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కు చిత్తశుద్ధి ఉంటే... 540 కోట్ల తో మానేరు రివర్ ఫ్రంట్ కట్టే ప్రయత్నం జరుగుతుంది. డంపు యార్డు కు ఆనుకొని ఉందనే విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో బీజేపి పాలకవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




