ధాన్యం కొనుగోలు కోసం కంట్రోల్ రూమ్ ప్రారంభం
ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 9 (విజయక్రాంతి): యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యం కొనుగోలు, రైతులు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రైతుల ఫిర్యాదులు స్వీకరించడానికి 9347416178 నంబర్ కేటాయించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. యాసంగి (రబీ) 2025-26 సీజన్ కలెక్టరేట్ లోని సివిల్ సప్లై కార్యాయం లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి (రబీ) 2025-26 సీజన్ ప్రారంభమైన సందర్భంగా ములుగు జిల్లాలోని వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు, రైతులకు ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయం లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం, రవాణా, మద్దతు ధర ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రైతులకు కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందని, సమస్యల ఫిర్యాదుల కోసం 9347416178 నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా పౌరసరఫరాల శాఖ అదికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి. హెచ్ మహేందర్ జీ, సివిల్ సప్లై డియం కృష్ణవేణి, డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




