13 August, 2026 | 4:03 AM

10 రెట్లు పరిహారం ఇవ్వాలి

13-08-2026 12:00 AM

రాజీవ్ రహదారి బాధితుల గోడు పట్టించుకోవాలి

తూమ్‌కుంట తరహాలోనే కార్ఖానాలో ఇవ్వాలి

సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు లేఖ

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని కార్ఖానా ప్రాంతంలో రాజీవ్ రహదారి విస్తరణ, ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కారణంగా ఇళ్లు, వాణిజ్య సముదాయాలు కోల్పోతున్న ఆస్తుల యజమానులకు 10 రెట్లు పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బాధితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. తూమ్‌కుంట తరహాలోనే కార్ఖానాలో కూడా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.

నిర్వాసుతలకు సామాజిక న్యాయం, సమానత్వం కాపాడ టానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని హితువు పలికారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. అలాగే డిజిటల్ లావాదేవీల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని, కొత్త ఆవిష్కరణలు, ఎంఎస్‌ఎంఈ రంగాలు పురోగమిం చినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.

ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి బాధితులు పూర్తిగా సహకరిస్తు న్నారని, అయితే తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, జీవనోపాధిని కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన, తగిన పరిహారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తూమ్‌కుంట ప్రాంతంలో సేకరించిన ఆస్తుల కు వాస్తవ విలువ కంటే 10 రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించిన తరహాలోనే కార్ఖానా కూడా పరిహారం పెంచాలని కోరారు. ప్రతి ఆస్తిని విడివిడిగా పునఃపరిశీలించి, ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.

బాధిత ఆస్తుల యజమానులతో సంప్రదింపులు జరిపిన అనంతరం సవరించిన పరిహారాన్ని ఖరారు చేసి, వారి ఆస్తులను స్వాధీ నం చేసుకునే ముందే పరిహారం చెల్లించాలని కోరారు. బాధితులకు న్యాయమైన, సముచితమైన, మెరుగైన పరిహారం అందించడం ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం కాపాడటంతో పాటు రాజీవ్ రహదారిపై ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ పనులు సజావుగా, వేగంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే సానుకూల చర్యలు తీసుకోవాలని కోరారు.

డిజిటల్ లావాదేవీల్లో టాప్

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారత్ ఎంతో ప్రగతి సాధించిందని, ముఖ్యం గా డిజిటల్ ఇండియా, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో దేశం మైలురాళ్లను అధిగమించిం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు గు ర్తుచేశారు. కొత్త ఆవిష్కరణలు, ఎంఎస్‌ఎంఈ రం గాలు పురోగమించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ఎస్‌వీపీ ఆధ్వర్యంలో బుధవా రం హైదరాబాద్‌లో నిర్వహించిన సైన్స్ ఫండ్ కార్యక్రమంలో రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్, శాస్త్రీయ ఆవిష్కరణల రంగానికి కూడా తగిన ఆర్థిక సహాయం అందించడం చాలా అవసరమన్నారు.

భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగా ల్లో తనదైన ముద్ర వేసిందని, సైన్స్ రంగానికి కేవలం ప్రభుత్వం నుంచే కాకుండా ప్రైవేట్ భాగస్వాముల నుంచి కూడా ఫండింగ్ పెరిగినప్పుడే నూతన ఆవిష్కర ణలు, ఎంఎస్‌ఎంఈ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దృఢపడుతుంద ని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం ప్రతి ఒక్కరికీ గర్వకా రణమన్నారు. ఇటీవల ప్రారంభించిన యూపీఐ విధానం ద్వారా నేడు ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ లావాదేవీలలో ఒక్క భార తే 40 శాతం వాటా కలిగి ఉండటం సాంకేతిక రంగానికి నిదర్శనమన్నారు.