బాధ్యతలు చేపట్టిన గిరమోని లక్ష్మీనారాయణ
07-05-2026 01:36 AM
గండీడ్, మే 6: పిఎసిఎస్ చైర్మన్ గా గిర మోడీ లక్ష్మీనారాయణ మండల కేంద్రంలోని కార్యాలయంలో డిసిఓ నుంచి గిరిమోని లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.
ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్న తమను సంప్రదించాలని నియమ నిబంధనలను పాటిస్తూ బ్యాంకు పురోగతికి తీసుకుపోయేందుకు శాహాయశక్తులుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టడం తో పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో ఆశన్న. సిబ్బంది పాల్గొన్నారు.






